బుట్టా రేణుక దుకాణం బంద్ అవుతుందా..?

0
403

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు కొత్త‌క‌లం మొద‌లైంది. అనేక‌మంది సీనియ‌ర్ నేత‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్ చుట్టూ ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక‌లు క్వ‌శ్చ‌న్‌మార్క్ వేశాయి. అందుకు ప్ర‌ధాన కార‌ణం ఈ ఎన్నిక‌ల్లో వారికి టికెట్‌లు ల‌భించ‌క‌పోవ‌డ‌మే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా అంద‌రి గౌర‌వం పొందిన ఆ నేత‌లు ఇక‌పై త‌మ సంగ‌తేంట‌న్న ఆందోళ‌న‌లో ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు నుంచి ఎంపీగా విజ‌యం సాధించిన బుట్టా రేణుక రాజ‌కీయ భ‌విత‌వ్యం కూడా ఇప్పుడు అలానే ఉంది.

2014 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు వైసీపీ ఎంపీగా గెలుపొందిన బుట్టా రేణుక రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో అధికార పార్టీ టీడీపీ తీర్ధం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లోనూ క‌ర్నూలు టీడీపీ ఎంపీ టికెట్ త‌న‌కే కేటాయిస్తార‌ని ఆమె భావించినా చివ‌ర‌కు ఎమ్మెల్యే టికెట్ కూడా క‌ష్ట‌మే అయింది. దీంతో ఆమె త‌న సొంత‌గూడు వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే వైసీపీలోకి ఎంట్రీ కుదిరినా టికెట్ మాత్రం ద‌క్క‌లేదు. దీంతో ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో పోటీచేసే అవ‌కాశం లేకుండా పోయింది. ఇలా బుట్టా రేణుక రాజ‌కీయ జీవితం డైల‌మాలో ప‌డ‌టంతో ఆమె అనుచ‌ర‌వ‌ర్గం క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతోంది.