స్టెప్స్ తో సెగలు పుట్టిస్తున్న పాయల్..!

0
319
bullreddy video song in seetha movie

తేజ దర్శకత్వవం వహిస్తున్న సినిమా ‘సీత’. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కాజల్ నటిస్తుంది. సినిమా మొత్తం కాజల్ చుట్టూతా తిరుగుతుందట. మోడ్రన్ సీత పాత్రలో తనకు ఏది చేయాలనిపిస్తే అది చేసేయడం… ఆమెకు నచ్చిన విధంగా ప్రవర్తించేలా కాజల్ కనిపిస్తుందట. ఈసినిమాలో ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ‘బుల్ రెడ్డి’ అంటూ ఐటెం సాంగ్ లోకి దిగింది. ఇటీవలే విడుదల చేసిన లిరికల్ సాంగ్ కి విశేషమైన స్పందన రాగ, తాజాగా ఇదే పాట ప్రోమో ను విడుదల చేశారు.

“బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి.. రాజ్ దూత్ మీదొచ్చే రామ్ రెడ్డి.. యమహా ఏసుకొచ్చే యాదిరెడ్డి.. బజాజ్ మీదొచ్చే బాల్ రెడ్డి ..” అంటూ పాయల్ వేసిన స్టెప్స్ అదిరాయి. కుర్రకారుకు మరింత హీట్ పుట్టించే స్టెప్స్ తో.. అందాలను ఆరబోస్తూ.. రాజ్ పుత్ రెచ్చిపోయింది. సాహిత్యం, సంగీతం, కొరియోగ్రఫీ, చిత్రీకరణ మంచి మసాలా వేసి మాస్ ఆడియన్స్ కి నచ్చేలా పాటను వదిలారు. జోరుగా, హుషారుగా సాగే పాటలో రాజపుత్ హాట్ హాట్ ఎక్స్ప్రెషన్స్ తో చిందేసింది. ఒక పక్క హీరోయిన్ గాను, మరో పక్క ఐటెం సాంగ్స్ తో ఊపులో ఉన్న అమ్మడు ఫుల్ బిజీ అయ్యింది. ‘ వెంకీ మామ’ సినిమాలో విక్టరీ కి జోడిగా నటిస్తుంది.

ఈ సినిమాలో సోనూసూద్,తనికెళ్ల భరణి,అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ వ్యవహరిస్తున్నాడు. మొత్తం పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమాను ఈ నెల 25వ తేదీన రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు చిత్ర యూనిట్.