బిగ్ బ్రేకింగ్ : బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

0
939

డోన్ అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్‌పై శాస‌న స‌భ‌కు ఎన్నికైన బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కేబినేట్‌లో మంత్రిగా కాసేటి క్రితమే ప్ర‌మాణ స్వీకారం చేశారు. అమ‌రావ‌తి వేదిక‌గా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మొద‌ట‌గా తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహం రాజేంద్ర‌నాథ్ బుగ్గ‌న‌ అని పిల‌వ‌గానే ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మ ప్రాంగ‌ణ‌మంతా క‌ర‌తాల ధ్వ‌నుల‌తో మారుమోగిపోయింది. మినిస్ట‌ర్ రాజేంద్ర‌నాథ్ అనే నినాదాల‌తో హోరెత్తింది.

ఆ త‌రువాత‌, గ‌వ‌ర్న‌ర్ పిలుపు మేర‌కు స‌భావేదిక‌పైకి చేరుకున్న ఆయ‌న బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ అనే నేను శాస‌నం ద్వారా నిర్మిత‌మైన భార‌త రాజ్యాంగంప‌ట్ల నిజ‌మైన విశ్వాసం విధేయ‌త చూపుతాన‌ని, భార‌త‌దేశ సార్వ‌భౌమాధికారాన్ని, స‌మ‌గ్ర‌త‌ను కాపాడుతాన‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రిగా నా క‌ర్త‌వ్యాల‌ను శ్ర‌ద్ధ‌తో, అంత‌క‌ర‌ణశుద్ధితో నిర్వ‌హిస్తాన‌ని, భ‌య‌ముకానీ, ప‌క్ష‌పాతంకానీ, రాగ‌ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాస‌నాల‌ను అనుస‌రించి న్యాయం స‌మ‌కూరుస్తాన‌ని దైవ సాక్షిగా ప్ర‌మాణం చేస్తున్నాను అంటూ మంత్రిగా త‌న ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేశారు.

ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న సీఎం జ‌గ‌న్ త‌న డ్రీమ్ కేబినేట్‌లో మొద‌టి విడ‌త‌గా త‌న‌కు మంత్రిగా అవ‌కాశం క‌ల్పించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి కేటాయించినా, కేటాయించ‌కున్నా త‌న జ‌న్మాంతం జ‌గ‌న్ వెంటే నడుస్తాన‌ని, అటువంటిది త‌న‌ను న‌మ్మి మినిస్ట‌ర్ ప‌ద‌వి కేటాయించి, ప్ర‌జల‌కు మ‌రింత సేవ చేసే భాగ్యం కల్పించిన జ‌గ‌న్‌కు త‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు రుణ‌ప‌డి ఉంటాన‌న్నారు.