వైఎస్ జ‌గ‌న్ త‌ల‌కిందులుగా త‌ప‌స్సు చేసినా సీఎం కాలేడు : బుద్దా వెంక‌న్న‌

0
406

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎప్ప‌టికీ రాలేద‌ని, ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌ల‌కిందులుగా త‌ప‌స్సు చేసినా సీఎం కాలేడ‌ని ఏపీ టీడీపీ నేత బుద్దా వెంక‌న్న అన్నారు. కాగా, ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాట్లాడే హ‌క్కు ఉంది క‌దా అని ఏదిప‌డితే అది మాట్లాడ‌టం స‌మంజ‌సం కాద‌న్నారు.

వైసీపీ నేత‌గా ఉన్న సీ.రామ‌చంద్ర‌య్య గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడ‌ని, ఆ స‌మ‌యంలో సోనియా గాంధీ దేవ‌త‌, రాహుల్ గాంధీని దేవుడిగా భావించార‌న్నారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు క‌నుక సోనియా గాంధీ దెయ్యం, రాహుల్ గాంధీ రాక్ష‌సుడుగా సీ.రామ‌చంద్రయ్య‌కు క‌న‌ప‌డుతున్నార‌న్నారు. అప్ప‌టిక‌ప్పుడు పార్టీలు, మాట‌లు మార్చే వారికి పౌర స‌మాజంలో విలువ ఉండ‌ద‌న్నారు. ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ గొడుక్కింద అవ‌త‌ల‌పార్టీని విమ‌ర్శించ‌డం సీ.రామ‌చంద్ర‌య్య‌కు అల‌వాట‌న్నారు.