కొత్త బిచ్చ‌గాడు పొద్దెర‌గ‌డు : ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి

0
501

ఏపీ రెండో శాస‌న స‌భలో గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ తొలి ప్ర‌సంగం చాలా చ‌ప్ప‌గా సాగింద‌ని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు. కాగా ఈ రోజు ఆయ‌న అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడుతూ ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఏర్ప‌డ్డ ప్ర‌భుత్వానికి స్ప‌ష్ట‌మైన విధానం లేద‌ని బుచ్చయ్య చౌద‌రి విమ‌ర్శించారు. అలాగే బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు సంబంధించి ప్ర‌భుత్వానికి యాక్ష‌న్‌ప్లాన్ లేదని, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అవ‌గాహ‌న లేద‌ని ఆయ‌న అన్నారు. ఆ క్ర‌మంలోనే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం కూడా ద‌శ‌, దిశ లేని విధంగా చాలా చ‌ప్ప‌గా కొన‌సాగింద‌న్నారు.

వైసీపీ ఎక్కువ ఎమ్మెల్యే సీట్ల‌ను గెలుపొంద‌డంతో ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌కు అవినీతి మ‌ర‌క‌లు అంటిద్దామ‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిపై స్ప‌ష్ట‌మైన విధాన‌ప‌ర‌మైన ఆలోచ‌న‌లు లేవ‌ని బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే కింజ‌ర‌పు అచ్చెన్నాయుడ‌ను బంట్రోతు అన్న క్ర‌మంలో.. తాము కూడా కొత్త బిచ్చ‌గాడు పొద్దెర‌గ‌డు అన‌డం త‌ప్పు కానేకాద‌ని బుచ్చ‌య్చ చౌద‌రి చెప్పుకొచ్చారు.