జ‌గ‌న్ ప్ర‌భుత్వానివి దుర‌దృష్ట విధానాలు.. ఎంద‌రో కాల‌గ‌ర్భంలో క‌లిశారు : బుచ్చ‌య్య చౌద‌రి

0
2597

గ‌డిచిన 30 ఏళ్ల త‌న రాజ‌కీయ జీవితంలో ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న దుర‌దృష్ట‌క‌ర విధానాల‌ను చూడ‌లేద‌ని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి దుయ్య‌బ‌ట్టారు. కాగా ఈ రోజు జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశంలో చోటు చేసుకున్న ప‌రిణామాల దృష్ట్యా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చ‌య్చ చౌద‌రిల‌ను స్పీక‌ర్ స‌భ నుంచి స‌స్పెన్ష‌న్ విధించారు. దీంతో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల సెష‌న్స్‌కు వీరు దూరం కానున్నారు.

అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో మీడియా పాయింట్ వ‌ద్ద బుచ్చ‌య్య‌చౌద‌రి మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లోనే స్పీక‌ర్ ఉన్నారంటూ విమ‌ర్శించారు. ఏపీ రాజ‌కీయాల్లో నియంత‌లా వ్య‌వ‌హ‌రించిన వారు ఎంద‌రెంద‌రో కాల‌గ‌ర్బంలో క‌లిసిపోయారంటూ విమ‌ర్శ‌లవ‌ర్షం కురిపించారు. 23 ప్ర‌తిప‌క్ష స‌భ్యులున్న స‌భ‌లో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అధికార పార్టీ స‌భ్యులు త‌డ‌బ‌డుతూ.. వారు చేస్తున్న అవ‌క‌త‌వ‌క‌ల‌ను త‌మ‌పై రుద్దేందుకే త‌మ‌ను స‌భ నుంచి స‌స్పెండ్ చేశారంటూ బుచ్చ‌య్య‌చౌద‌రి అన్నారు.