చిన్న‌తిరుప‌తిలో త‌ప్పిన ముప్పు

0
298

చిన్న‌తిరుప‌తి వెంక‌న్న‌ స‌న్నిధిలో పెనుముప్పు త‌ప్పింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ద్వారకా తిరుమలలో కొలువైఉన్నసుప్ర‌సిద్ధ‌ చిన్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆలయ నిత్యాన్నదాన భవనం పక్కన బాయిలర్ భారీ శ‌బ్ధంతో పేలిపోయింది. దీంతో భ‌క్తులు, గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం త‌ప్పింది. వేంక‌టేశ్వ‌రుని క‌టాక్షంతోనే ముప్పుత‌ప్పింద‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తున్నారు.