ఆసక్తిని రేపుతోన్న ‘బ్రోచేవారెవరురా’ లిరికల్ వీడియో సాంగ్

0
58
vagaladi lyrical song from brochevarevarura

మన్యం ప్రొడక్షన్స్ పతాకం పై విజయ్ నిర్మిస్తున్న సినిమా ‘బ్రోచేవారెవరురా’ కు వివేక్ ఆత్రేయ దర్శకత్వము వహిస్తున్నారు. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనే ట్యాగ్ లైన్ ఆసక్తిరేపేలా ఉంది. వైవిధ్య భరితమైన కథాకథనాలతో సాగే ఈ చిత్రంలో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్నాడు. శ్రీవిష్ణు కి జోడిగా నివేదా థామస్ నటిస్తుంది. సత్యదేవ్, నివేత పేతురేజ్ , ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్, టీజర్  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపుగా సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. తాజాగా సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు.

“ఓ యే వగలాడి.. వగలాడి.. యే వగలాడి.. పొద్దెక్కినాదిక పలుకులాపాని అంటావేంటే వయ్యారి.. ” అంటూ కొనసాగే పాటకు వివేక్ సాగర్ సంగీతాన్ని.. హసిత్ గోలి సాహిత్యాన్ని సమకూర్చారు. వివేక్ సాగర్, బాలాజీ, రామ్, మనీషా ఆలాపన కొత్తగా ఆకట్టుకునేలా ఉంది. వినోదభరితమైన చిత్రంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించుటకు ముందుకు రానుంది.