జాతిపిత గాంధీకి ఘోర అవ‌మానం..!

0
455

జాతిపిత గాంధీకి ఘోర అవ‌మానం జ‌రిగింది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల్లో ఒక‌రైన గాంధీ చిత్ర‌ప‌టాన్ని ప్ర‌తి ఒక్క‌రు వారు నిత్యం ఆరాధించే దైవం ప‌క్క‌నేపెట్టి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం విధిత‌మే. పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయులు సైతం గాంధీ మార్గంలో న‌డ‌వాలంటూ శాంతి ఉప‌దేశాల‌ను విద్యార్ధుల‌కు చెబుతుంటారు. ఇలా అంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయ‌మై గాంధీకి అవ‌మానం జ‌రిగేలా కొంద‌రు ప్ర‌వ‌ర్తించిన తీరు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అయితే, సంగారెడ్డి జిల్లా రామ‌చంద్ర‌పురంలోని బీహెచ్ఈఎల్ మాక్ సొసైటీలో ఏర్పాటు చేసిన జాతిపిత మ‌హాత్మ గాంధీ విగ్ర‌హాన్ని కొంద‌రు అగంత‌కులు కూల్చేశారు. ప్రత్యేకించి గాంధీ విగ్ర‌హ నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన కాలును, చేతిని విర‌గ్గొట్టారు. ఈ సంఘ‌ట‌న‌పై యావ‌త్ స‌మాజం ఆగ్ర‌హావేశాల‌ను వెల్ల‌గ‌క్కుతోంది. ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది.