ప్రాణభయంతో దుస్తులు లేకుండా రోడ్డు మీదకొచ్చిన మహిళా : ఫోటో తీసి..

0
358
ప్రాణభయంతో దుస్తులు లేకుండా రోడ్డు మీదకొచ్చిన మహిళా : ఫోటో తీసి..
ప్రాణభయంతో దుస్తులు లేకుండా రోడ్డు మీదకొచ్చిన మహిళా : ఫోటో తీసి..

నేటి ఆధునిక యుగంలో కూడా కోడలు వేదించే కుటుంబాలు చాలానే ఉన్నాయని అనేక ఘటనలు నిరూపించాయి. బారి కట్నం కోసం పెళ్లిళ్లు చేసుకోవడం.. అందులో ఏమైనా తేడా వస్తే భార్యను వేదించడం అనేది సర్వసాదరణం అయిపోయాయి. ఎన్ని చట్టాలు వచ్చిన అలాంటి వారికి శిక్ష మాత్రం పడడం లేదు కారణం డబ్బు. అదే ఉంటే ఈ దేశంలో నిన్ను శిక్షించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనే మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

రాజస్థాన్ లోని “చురు” చెందిన ఒక కుటుంబం మొత్తం ఇంటికి వచ్చిన కోడలు అని కూడా చూడకుండా దుస్తులు చిరిగి, వివస్త్ర అయ్యేలా దాడికి పాల్పడ్డారు. ఆ రాక్షసులనుండి ప్రాణాలు కాపాడుకునే భయంలో తను ఎలా ఉందో కూడా మర్చిపోయి పోలీస్ స్టేషన్ కి పరుగులు తీసింది. అది చూసిన సమాజం ఏం చేయాలి ? తమ దగ్గరున్న వస్త్రాలను కప్పి మహిళకు సహాయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు.. దుస్తులు లేకుండా రోడ్డుమీదకు వచ్చిన ఆ మహిళను ఫోటోలు, వీడియోలు తీశారు. ఇది మనం బ్రతుకుతున్న సమాజం. విషయం తెలుసుకున్న పోలీసులు వారిపై కేసు పెట్టి వీడియోస్ డిలెట్ చేసేపనిలో ఉన్నారు.