బ్రేకింగ్ న్యూస్ : KA పాల్ నామినేషన్ ను తిరస్కరించిన అధికారులు..!

0
343
బ్రేకింగ్ న్యూస్ : KA పాల్ నామినేషన్ ను తిరస్కరించిన అధికారులు..!
బ్రేకింగ్ న్యూస్ : KA పాల్ నామినేషన్ ను తిరస్కరించిన అధికారులు..!

అనుకున్నదే జరిగింది.. ఎప్పుడు లేనివిదంగా ఈసారి మరింత హడావుడి చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ ఈసారైనా పోటీచేస్తాడా ? లేక ఎప్పటిలాగే అడ్రస్ లేకుండా వెళ్లిపోతాడా ? అని అందరిలో అనుమానం ఉండేది. ఆ అనుమానం ఇప్పుడు నిజం అయ్యిందనే చెప్పాలి. అవును ఆలస్యంగా వెళ్లడాని KA పాల్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారని తెలుస్తుంది. పశ్చిమ గోదావరి భీమవరంలో KA పాల్ నామినేషన్ ను తిరస్కరించారు అధికారులు.

25వ తేదీ ఏ నామినేషన్ లకు చివరితేది కావడంతో ఈరోజు పెద్ద ఎత్తున నామినేషన్ లు దాఖలయ్యాయి. ఇలాంటి సమయంలో ఏం జరిగిందో ఎందుకు ఆలస్యం అయ్యిందో తెలియదు కానీ.. నామినేషన్ సమయం ముగిసిన తరువాత అక్కడికి చేరుకున్నాడు KA పాల్.. దాంతో చేసేదిలేక అతడి నామినేషన్ ని తిరస్కరించారు ఎన్నికల అధికారులు. ఇక ఇప్పటికే “నర్సాపురం” MP అభ్యర్థిగా KA పాల్ నామినేషన్ వేశాడు.. కానీ అక్కడ కూడా మరికొన్ని పత్రాలు కావాలని ఆ నామినేషన్ ని కూడా పెడ్డింగ్ లో పెట్టారని తెలుస్తుంది. ఇలాంటి సమయంలోనే భీమవరం నుండి MLAగా నామినేషన్ వేయాలని వెళ్ళిన పాల్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.