బ్రేకింగ్ : నుజ్జు నూజ్జయిన సునిల్ కారు –”ఫెక్ న్యూస్” సునిల్ వివరణ

0
163

ఈమద్య సోషల్ మీడియాలో బ్రతికున్న వ్యక్తులను సైతం చంపేస్తున్నారు. వ్యూస్ కోసం, డబ్బు కోసం మనుషులు ఎంత నీచానికి దిగజారుతున్నారో ఈ ఘటనను చూసి తెలుసుకోవచ్చు. టాలీవుడ్ లో ప్రముఖ కామిడియన్ గా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ ను సంపాదించుకున్న నటుడు సునిల్ కారు ప్రమాదంలో మరణించాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఆయన అభిమానులతో పాటు తెలుగు పరిశ్రమ పెద్దలు కూడా షాక్ కి గురయ్యారని తెలుస్తుంది.

దాంతో సునిల్ ప్రస్తుతం ఎక్కడున్నాడు ? ఈవార్త నిజంగా నిజమేనా ? లేదా ఫెక్ న్యూస్ హా ? అంటూ పరిశ్రమ వర్గాలు మొత్తం షాక్ కి గురయ్యాయయి. దాంతో వెంటనే సునిల్ కు, ఆయన స్నేహితులు వందల సంఖ్యలో కాల్ వెళ్ళాయి. ఏం జరిగిందో అర్దం కానీ సునిల్ “నేను బాగానే ఉన్నాను” అని వివరణ ఇవ్వడంతో, సోషల్ మీడియాలో నీపై ఇలాంటి వార్తలు వస్తున్నాయని సదురు వీడియోను ఆయనకు సెండ్ చేశారు. అది చూసి బాదకు గురైన సునిల్ “ఇది ఫెక్ న్యూస్.. నేను బాగానే ఉన్నాను.. ఎవ్వరూ ఇలాంటి వార్తలు నమ్మవద్దు” అంటూ అదే సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాడు.