సన్నీలియోన్ స‌ర‌స‌న‌ సునీల్‌, బ్ర‌హ్మానందం

0
205

టాలీవుడ్‌ టాప్ కమెడియన్స్ బ్రహ్మానందం, హీరో సునీల్ బంప‌రాఫ‌ర్ కొట్టేశారు. బాలీవుడ్ లోనేకాదు, వ‌ర‌ల్డ్ హాట్ బ్యూటీ స‌న్నీలియోన్ తో వీరిద్ద‌రూ జ‌త‌క‌ట్ట‌బోతున్నారు. అంతేకాదు, ఇరువురూ బాలీవుడ్లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. హారర్ కామెడీ జోనర్లో వస్తున్న ఓ మూవీకి ఈ ఇద్దరు నటులు తమ ఆమోదాన్ని తెలుపుతూ అగ్రిమెంట్ పై సంతకాలు కూడా చేశారు.

ఈ మూవీలో శృంగారతార సన్నీలియోన్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ మూవీకి ప్రసాద్ తాతినేని దర్శకత్వం వహిస్తుండగా, పేరు ఇంకా నిర్ణయించాల్సిఉంది. ఈ ఇద్దరు లెజెండరీ తెలుగు కమెడియన్స్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.