మోదీకి బాలీవుడ్ బాద్షా షారూక్ అభినందనలు ..!

0
52

సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం పొందిన ప్రధాని నరేంద్ర మోదీకి పలువురు ప్రముఖులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. అనేకానేక రంగాల నుంచి మోదీ కి శుభాకాంక్షలు అందుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సార్క్ దేశ అధినేతలు మోదీ కి అభినందనలను తెలిపారు. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి, అజయ్ దేవగణ్, రవీనాటాండన్, వరుణ్ ధవన్, పరిణీతి చోప్రా, కరణ్ జోహార్‌లు ట్వీట్ల ద్వారా నరేంద్ర మోదీని అభినందనలు తెలిపారు.

తాజాగా బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ నరేంద్ర మోదీకి ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలియ చేశాడు. మోదీ ఘన విజయం ప్రజాస్వామ్యానికి చెందిన గొప్ప విజయమని తెలిపాడు. పని చేయాలనుకునే వారికి పట్టం కట్టారు. భారతీయులు గా అందరు గర్వించదగిన స్పష్టమైన తీర్పునిచ్చిన మీ ఆశలు, కలలన్ని తప్పక నెరవేరాలని ఆశిస్తున్నాను అని చెప్పారు. ఈ పరంగా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న మోదీకి నా గణనీయమైన అభినందనలు అంటూ షారూక్ ట్వీట్ లో తెలిపాడు.