డిగ్రీ తర్వాత PG చదవకుండా ఎంఫిల్ ఎలా చేస్తారు రాహుల్ గారు : GVL

0
198
డిగ్రీ తర్వాత PG చదవకుండా ఎంఫిల్ ఎలా చేస్తారు రాహుల్ గారు : GVL
డిగ్రీ తర్వాత PG చదవకుండా ఎంఫిల్ ఎలా చేస్తారు రాహుల్ గారు : GVL

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ తిరస్కరించారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. దాంతో అదేంటి దేశ ప్రధాని అభ్యర్థి అయిన రాహుల్ నామినేషన్ తిరస్కరించడం ఏంటి ? అనే చర్చ దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యింది.. నిజానికి రాహుల్ నామినేషన్ తిరస్కరించారు అనే వార్త అబద్దం.. కానీ తిరస్కరించండి అని ఒక MP అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం మాత్రం నిజం.

ఇంతకీ ఏంజరిగిందంటే.. రాహుల్ గాంధీ, “వయనాడ్‌”తో పాటు “అమేథీ”లో కూడా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. “అమేథీ” నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న “ధృవ్‌ లాల్” అనే వ్యక్తి “రాహుల్ గాంధీ” నామినేషన్‌ను తిరస్కరించండి అని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. రాహుల్ “అఫిడఫిట్‌”లో పేర్కొన్న వివరాలు చాలావరకు తప్పులేనని.. తన పేరు దగ్గర నుండి అడ్రెస్, పంపనీల వివరాలు మొత్తం తప్పుగా పేర్కొన్నడని అతడి ఆరోపించాడు.

ఈ నేపథ్యంలో రాహుల్ నామినేషన్ ను పరిశీలించిన ఎన్నికల అధికారి “రాంమనోహర్ మిశ్రా” రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియను ఈ నెల 22కు వాయిదావేశారు. అయితే ఈ విషయమై స్పందించిన BJP నేత GVL నరసింహారావు, రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ భారతీయుడా కాదా ? అనేది మొదటి నుండే అందరికీ అనుమానాలు ఉన్నాయని ఆరోపించాడు.

లండన్ లో ఒక కంపనీ నడుపుతున్న ఆయన బ్రిటిషన్ సిటిజన్ గా అక్కడి ప్రభుత్వానికి చెప్పుకున్నాడని.. ఇదే మన దేశానికి వచ్చి నేను భారతీయుడినే అంటున్నాడు. ఇందులో నిజం ఏది ? అబద్దం ఏదో తేలాగే అతడి నామినేషన్ ని స్వీకరించాలని GVL కోరారు. మరీ ముఖ్యంగా రాహుల్ విద్యా అర్హతలపై ప్రశ్నించిన GVL “డిగ్రీ తర్వాత PG చదవకుండా ఎంఫిల్ ఎలా చేస్తారో రాహుల్ గాంధీ చెప్పాలని ఆయన ప్రశ్నించారు.