మ‌రోసారి మోడీ నేతృత్వంలో ఎన్డీయే స‌ర్కారు..!

0
152

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం ఖాయ‌మ‌ని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు అన్నారు. కాగా, ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మ‌ళ్లీ ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో ఎన్డీయే స‌ర్కార్ ఏర్ప‌డుతుంద‌ని జోస్యం చెప్పారు. కొంత‌మంది బీజేపీ ఓడిపోతుంద‌ని ఆశ‌ప‌డుతున్నార‌ని, కానీ అటువంటి ఆశ‌లు నెర‌వేర‌వ‌ని ఆయ‌న అన్నారు. వార‌ణాసిలో కూడా ప్ర‌ధాని మోడీ గ‌తంకంటే భారీ మెజార్టీతో గెలుస్తార‌ని ఆయ‌న అన్నారు.

అన్ని రాష్ట్రాల్లో ఈ ద‌ఫా జ‌రిగిన‌, జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ హ‌వా చాలా విస్తృతంగా వీస్తుంద‌న్నారు. గ‌తంలోకంటే కూడా ఈ సారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ ఎక్కువ సంఖ్య‌లో ఎంపీ స్థానాల‌ను గెలుపొంద‌డం జ‌రుగుతుంద‌ని జీవీఎల్ న‌ర‌సింహారావు చెప్పారు. బీజేపీకి మెజార్టీ స్థానాల‌కంటే ఎక్కువ త‌ప్ప‌నిసరిగా వ‌స్తాయ‌ని, న‌రేంద్ర మోడీ మ‌ళ్లీ ప్ర‌ధానిగా, ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే ఎన్డీయే ప్ర‌భుత్వం ఏర్పాట‌వుతుంద‌ని జీవీఎల్ న‌ర‌సింహారావు చెప్పారు.