టీ.కాంగ్రెస్‌కు బిగ్‌షాక్ : కారెక్కిన మ‌రో ఎమ్మెల్యే..!

0
126

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు చేజార‌కుండా ఆ పార్టీ నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేదు. తాజాగా భూపాప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్న‌ట్టు బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అనంత‌రం ఓ లేఖ‌ను గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి విడుద‌ల చేశారు. ఆ లేఖ‌లో తాను కాంగ్రెస్‌ను వీడుతున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకే టీఆర్ఎస్‌లో చేరుతున్న‌ట్టు గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. గండ్ర దంప‌తుల‌తో కాంగ్రెస్ ముఖ్య నేత‌లు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, శ్రీ‌ధ‌ర్‌బాబు మంత‌నాలు జ‌రిపినప్ప‌టికీ వారి బుజ్జ‌గింపుల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.