మ‌రో వివాదంలో తెలుగు బిగ్‌బాస్‌..!

0
218

తెలుగు బిగ్‌బాస్ -3 స్టార్ట్ కాక‌ముందే వివాదాలు మొద‌ల‌య్యాయి. బిగ్‌బాస్‌లో కాస్టింగ్‌కౌచ్ ఉందంటూ తాజాగా ఓ యాంక‌ర్ ఆరోప‌ణ‌లు చేసింది. యాంక‌ర్ శ్వేతారెడ్డి బిగ్‌బాస్ పాటిస్పెంట్స్ ఎంపిక తేడాగా ఉంద‌ని కుండ‌బ‌ద్ద‌లుకొట్టారు.

శ్వేతారెడ్డి మాట్లాడుతూ బిగ్‌బాస్ షో నిర్వాహ‌కులు ఏప్రిల్ నెల‌లో త‌న‌కు ఫోన్‌చేసి, బిగ్‌బాస్ షోకు సెలెక్ట్ చేశామ‌ని చెప్పి త‌మ‌ను క‌ల‌వాల‌ని చెప్పారన్నారు. వారు చెప్పిన తీరుగానే వారిని క‌లిసి ఆ త‌రువాత షో చేయ‌డానికి తాను సిద్ధ‌మేన‌ని చెప్పాన‌న్నారు. ఆ త‌రువాత త‌న‌కు ఊహించ‌ని షాకింగ్ ఫ‌లితాలు ఎదుర‌య్యాయ‌ని శ్వేతారెడ్డి తెలిపారు.

అగ్రిమెంట్ త‌రువాత మ‌రో కో ఆర్డినేట‌ర్ మా బాస్‌ను మీరు ఎలా ఇంప్రెస్ చేస్తార‌ని అడిగార‌ని శ్వేతారెడ్డి చెప్పుకొచ్చారు. మిమ్మ‌ల్ని తీసుకుంటే మాకేంటి లాభం..? అని అడిగార‌ని, బిగ్‌బాస్ హిట్ అవ్వాలంటే మీరు ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారు..? ఎలాంటి యాక్టివిటీస్ ప్లే చేస్తారు.? అని బిగ్‌బాస్ నిర్వాహ‌కులు అడ‌గడంతో షాక్ అయ్యాన‌ని శ్వేతారెడ్డి చెప్పారు.

ఇది రియాల్టీ షో.. భిన్న‌మైన మ‌న‌స్తత్వం క‌లిగిన వారిని అందులో ప్ర‌వేశ‌పెడ‌తారు. అక్క‌డ ఇచ్చే టాస్క్‌ల‌ను బ‌ట్టి గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. అంతేగాని ముందుగానే ఏం చేస్తారు..? అని అడ‌గ‌డంపై శ్వేతారెడ్డి బిగ్‌బాస్‌పై కామెంట్స్ చేశారు. శ్వేతారెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోస‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.