బిగ్‌బాస్ – 3 : శ్రీ‌ముఖి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌..!

0
1294

ప్ర‌ముఖ యాంక‌ర్‌, బిగ్‌బాస్ – 3 కంటెస్టెంట్ శ్రీ‌ముఖి త‌న అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం రాత్రి ప్రారంభ‌మైన బిగ్‌బాస్ షోలో 13వ కంటెస్టెంట్‌గా శ్రీ‌ముఖి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ వెంట‌నే ఇస్మార్ట్ శంక‌ర్ మూవీలోని దిమ్మాక్ క‌రాబ్ సాంగ్‌కు అద్దిరిపోయే స్టెప్పులతో బిగ్‌బాస్‌తోపాటు, షోను వీక్షించిన ప్రేక్ష‌కుల‌ను సైతం ఆక‌ట్టుకుంది. చివ‌ర‌గా త‌న‌కు ఎంతో ఫేమ్ తెచ్చిన రాముల‌మ్మ పాట‌ను చిందులేసి త‌న అభిమానుల‌ను అల‌రించింది.

అనంత‌రం త‌న‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపేందుకు వ‌చ్చిన షో హోస్ట‌ర్ నాగార్జున‌ను హ‌గ్‌చేసుకుని, హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అంత‌కు ముందు నాగార్జున అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా హౌస్‌లో ఎవ్వ‌రినీ ఇబ్బంది పెట్ట‌కుండా, త‌న ఆట‌ను తాను ఆడుతూ, త‌న‌కు మ‌న‌సు ఏది చెప్తే అదే చేస్తూ విజేత‌గా తిరిగి వ‌స్తానంటూ చెప్పింది.

శ్రీ‌ముఖి అలా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో.. లేదో..ఆ వెంట‌నే ట్విట‌ర్‌లో వీడియో ఒక‌టి ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆ వీడియోలో శ్రీ‌ముఖి మాట్లాడుతూ మీరు బిగ్‌బాస్‌కు సెలెక్ట్ అయ్యారా..? అంటూ చాలా మంది త‌న‌ను అడిగార‌ని, కానీ బిగ్‌బాస్ షో నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆ వివ‌రాలేమీ ఇత‌ర‌కుల‌కు చెప్ప‌కూడ‌దు క‌నుక తాను చెప్ప‌లేక‌పోయాన‌ని చెప్పింది.

కానీ తాను షోలోకి ఎంట్రీ ఇచ్చిన వెంట‌నే ఈ వీడియో ట్విట‌ర్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేలా టైమ్ సెట్ చేశాను క‌నుక‌, ఇది బిగ్‌బాస్ రూల్స్‌ను అతిక్ర‌మించ‌డం కాదని, త‌న ఫ్యాన్స్‌తోపాటు ఇత‌రులు కూడా త‌న‌కు ఓట్‌చేసి గెలిపించాల‌ని శ్రీ‌ముఖి కోరింది.

ఇలా బిగ్‌బాస్‌హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంట‌నే ఏ కంటెస్టెంట్ చేయ‌ని విధంగా శ్రీ‌ముఖి ట్విటర్ వీడియోలో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం ఆమె తెలివి తేట‌ల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని, ఆ తెలివి తేట‌లే ఆమెను బిగ్‌బాస్ -3 విజేత‌గా నిల‌బెడతాయ‌ని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.