బిగ్‌బాస్‌పై క‌న్నా లక్ష్మీ నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

0
1380

తెలుగు బిగ్‌బాస్ షోపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయణ ట్వీట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఈ షో ప్ర‌సారం కాకుండా అనుమ‌తుల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరారు. మ‌హిళ‌ల గౌర‌వానికి భంగం క‌లిగించేలా బిగ్‌బాస్ షో నిర్వ‌హిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. బిగ్‌బాస్ షో కార‌ణంగా యువ‌త పూర్తిగా ప‌క్క‌దారి ప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. బిగ్‌బాస్ షోకు అనుమ‌తుల‌ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను కోరారు.