డాషింగ్ డైరెక్ట‌ర్‌కి దిమ్మ‌తిరిగిపోయే షాక్‌

0
197

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌కి దిమ్మ‌తిరిగిపోయే షాక్ త‌గిలింది. రామ్‌ పోతినేని హీరోగా పూరీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్త‌యిన నేప‌థ్యంలో పూరీ టీంలోని ముర‌ళీ కృష్ణ అనే వ్య‌క్తి బిగ్ షాక్ ఇచ్చాడు. ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్‌ను ముర‌ళి బజ్‌ బాస్కెట్‌ (Buzz Basket) ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూప్‌లో పోస్ట్ చేసేశాడు.

అంతేకాదు, స్క్రిప్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ను తీసేసేందుకు ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రయూనిట్ నుంచి భారీగా డబ్బు డిమాండ్‌ చేశాడు. దీంతో నిర్మాణ సంస్థలు పూరి జగన్నాథ్‌ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్ తరుపున రవి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.