బిగ్ బ్రేకింగ్‌: బ్యాలెట్ బాక్సుల‌కు చెద‌లు.. తుక్కుతుక్కైన ఓట్లు

0
79

బ్రేకింగ్ న్యూస్… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తుపోయే వింతైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కౌంటింగ్ లో భాగంగా ఈ ఉద‌యం మహాదేవపూర్ మండలం అంబట్ పల్లి గ్రామంలోని బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ నిమిత్తం ఓపెన్ చేశారు.

అయితే, బ్యాలెట్ బాక్స్ లోని ఓట్లు పూర్తిగా చెదలు పట్టేశాయ్. ఓట‌ర్లు వేసిన ఓట్లు తుక్కుతుక్కైపోయాయి. ఈ విష‌యాన్ని MPDO, DPO పరిశీలించి కలెక్టర్ కు సమాచారం అందించారు. పై అధికారుల ఆదేశాలు వచ్చేవరకు స‌ద‌రు బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ ఆపివేశారు. మొత్తం ఆ బాలట్ బాక్స్ లో 395 ఓట్లు ఉన్నాయి.