ప‌క్కింట్లోకి తొంగిచూడ‌మ‌ని నేర్పించ‌డ‌మేనా బిగ్‌బాస్ షో అంటే ..!

0
166

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను విరామం లేకుండా వంద రోజుల‌పాటు అల‌రించేందుకు బిగ్‌బాస్ – 3 ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. నిర్వాహ‌కులు ఏ ముహూర్తాన ప్రారంభ‌తేదీని ఫిక్స్ చేశారో కానీ.. వివాదాలు అప్పుడే మొద‌లైపోయాయి.

షోలో మీరు పాటిస్పేట్ చేయ‌బోతున్నారు రెడీగా ఉండండి అంటూ కాంట్రాక్ట్ కాగితాల‌పై సంత‌కాలు చేయించుకుని చివ‌ర‌కు మీ పేరు సెలెక్టివ్ ప‌ర్స‌న్స్‌లో లేదు అంటూ నిర్వాహ‌కులు హ్యాండిచ్చార‌ని ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ శ్వేతారెడ్డి మీడియా ముందు చెప్పిన విష‌యం విధిత‌మే.

ఇలా నాగార్జున హోస్ట్ చేయ‌నున్న బిగ్‌బాస్ -3 ప్రారంభం కాక‌ముందే వివాదాలు చుట్టుముట్ట‌డంతో నిర్వాహ‌కులు కాస్త అస‌హ‌నానికి లోనైన‌ట్టు తెలుస్తుంది. ఈ నేప‌థ్యంలో ప్రొఫెస‌ర్ తిరుగ‌రి జ్యోత్స్న త‌న‌దైన శైలిలో బిగ్‌బాష్ షోపై విరుచుకుప‌డ్డారు. అందుకు సంబంధించిన పూర్తి వీడియో..!