బిగ్‌బాస్ హౌస్‌లో తీన్మార్ సావిత్రి..!

0
248

యాంక‌ర్ సావిత్రి ఒకే ఒక్క ప్రోగ్రామ్‌తో విప‌రీత‌మైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ యాస‌తో వార్త‌లు చెబుతూ ఎంతో మందిని త‌న‌వైపును తిప్పుకుంది సావిత్రి అలియాస్ శివ‌జ్యోతి. ఇప్పుడు ఆమె తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే విష‌య‌మై బిత్తిరిస‌త్తి చేసిన కామెంట్స్ చూస్తుంటే నిజ‌మే అనిపించ‌క‌మాన‌దు.

అయితే, ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌య్యే తీన్మార్ ప్రోగ్రామ్‌లో గ‌త వారం రోజుల నుంచి సావిత్రి క‌నిపించ‌డం లేదు. అంత‌కు ముందు రోజుల్లో సావిత్రి అంటే తీన్మార్‌.. తీన్మార్ అంటే సావిత్రి అన్న చందాన కార్య‌క్ర‌మం కొన‌సాగేది. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ కోసం స్టార్ మాతో ఒప్పందం చేసుకోవ‌డంతో సావిత్రి తాను రెగ్యుల‌ర్‌గా చేసే తీర్మాన్ ప్రోగ్రామ్‌కు రాజీనామా చేసేసింద‌నిఆమె స‌న్నిహితులు కూడా చెబుతున్నారు.

ఇదే విష‌య‌మై బిత్తిరి స‌త్తి క్లారిటీ ఇచ్చాడు. అయితే తీన్మార్ ప్రోగ్రామ్‌లో భాగంగా అక్కా అక్కా అంటూ బిత్తిరి స‌త్తి సావిత్రిని అట‌ప‌ట్టించ‌డాన్ని ప్ర‌తీ ఒక్కరికి వినోదాన్ని పంచింద‌నే చెప్పాలి. బిత్తిరిస‌త్తి మాట్లాడుతూ సావిత్రి రాజీనామా త‌న‌కు షాకింగ్ న్యూస్ అని, ఆమె ఎక్క‌డ ఉన్నా.. ఏం చేసినా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నానంటూ బిత్తిరి స‌త్తి చెప్పాడు. బిత్తిరి స‌త్తి మాట తీరుతో సావిత్రి బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వ‌డం క‌న్ఫామ్ అన్న కామెంట్లు సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్నాయి.