అసెంబ్లీలో ఉన్న జ‌గ‌న్‌కు భూమా అఖిల ప్రియ ఫోన్‌..!

0
1570

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన భూమా అఖిల ప్రియ ఆ త‌రువాత కాలంలో అధికారంలోని టీడీపీ తీర్ధం పుచ్చుకుని మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణానంత‌రం నంద్యాల శాస‌న స‌భ‌కు జరిగిన ఉప ఎన్నిక‌లో త‌న సోద‌రుడైన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని బ‌రిలో నిలిపిన అఖిలప్రియ గెలిపించుకున్నారు.

అయితే ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూడ‌టంతోపాటు క‌ర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యేలుగా బ‌రిలో నిలిచిన అఖిల ప్రియ, బ్ర‌హ్మానంద‌రెడ్డి ఇద్ద‌రు కూడా ఓడిపోయారు. దీంతో రాజ‌కీయాల్లో భూమా ఫ్యామిలీ మ‌నుగ‌డ‌ను కొన‌సాగించాలంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరాల‌ని మాజీ మంత్రి అఖిల ప్రియ నిర్ణ‌యించారన్న క‌థ‌నాలు ఇటు సోష‌ల్ మీడియాతోపాటు అటు క‌ర్నూలు జిల్లా రాకీయాల్లో చ‌ర్చ‌లు విస్తృతంగా జ‌రుగుతున్నాయి.

ఆ క్ర‌మంలోనే సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌ల్లి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మను సంప్ర‌దించేందుకు అఖిల ప్రియ ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేశారంటూ ఆ సోష‌ల్ మీడియా క‌థ‌నాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా గ‌తంలో వైఎస్ ఫ్యామిలీకి, భూమా ఫ్యామిలీకి మ‌ధ్య మంచి స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా, భూమా అఖిల ప్రియ‌కు సంబంధించి మ‌రో సంచ‌ల‌న వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే గ‌త ఏడాది వైఎస్ జ‌గ‌న్ ప్రజా సంక‌ల్ప యాత్ర చేస్తున్న స‌మ‌యంలో టీడీపీ మంత్రిగా ఉన్న భూమా అఖిల ప్రియ ఫోన్ చేశారంటూ ఓ క‌థ‌నం సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అదే మాదిరి క‌థ‌నం మ‌రొక‌టి ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉంది. భూమా అఖిల ప్రియ జ‌గ‌న్‌కు ఫోన్ చేశార‌ని, సీఎం అయినందుకు శుభాకాంక్ష‌లు తెలిపి వైఎస్ ఫ్యామిలీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయన్న‌ది ఆ క‌థ‌నం సారాంశం. మ‌రి ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను చూస్తే ఆ క‌థ‌నం నిజ‌మ‌య్యే అవ‌కాశాలు చాలానే ఉన్నాయంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం వారి వారి అభిప్రాయాల‌ను తెలుపుతున్నారు.