‘RRR’ జక్కన్న కోసం నాలుగు ఇండస్ట్రీల అగ్ర నటులు..!

0
136
RRR movie
Main roles playing in RRR movie

ప్రభాస్ తో బాహుబలి సినిమాను ప్రేక్షకులకు అందించి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అదే విజయంతో మరో బ్లాక్ బస్టర్ అందించాలని ‘RRR’ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. టాలీవుడ్ అగ్రహీరోలైన కొణిదెల రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి సినిమాను ప్రారంభిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదలు కాక ముందు నుంచే ఎన్నో రూమర్లు సోషల్ మీడీయాలో చెక్కర్లు కొట్టాయి. అందులో ముఖ్యంగా రామ్ చరణ్ సరసన ఎవరు నటిస్తున్నారా ? జూనియర్ ఎన్టీఆర్ జోడిగా భామ దొరికిందంటూ.. ఎన్నోవార్తలు విహరించాయి. ఇక ఇలాంటి రూమర్లకు రాజమౌళి కి చెక్ పెట్టే విధంగా ఒక ప్రెస్ మీట్ లో ఈ సినిమాకు సంబంధించిన పాత్రలు, పాత్రధారులను, సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

రాజమౌళి మాట్లాడుతూ నేను ప్రతిసినిమాను, నా మొదటి సినిమాగా తీసుకొని విజయాన్ని వైపు అడుగులు వేయాలనుకుంటాను అని చెప్పారు. ఇక సినిమా కథ విషయానికొస్తే ఇది ఒక కల్పితమైన పాన్ ఇండియా సినిమా. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ వీరిద్దరి పోరాట యోధుల గూర్చి ప్రజలకు తెలియజేసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పోరాట యోధులుగా మారకముందు సమాజానికి కొంత కాలం దూరంగా ఉండి జీవనాన్ని కొనసాగించారు. ఆ సమయంలో వీరు ఎక్కడున్నారు ? యోధులుగా మారడానికి ఎదురైనా పరిస్థితి ఏంటి ? ఆ సంఘటనలకు సంబంధించిన నేపథ్య పరంగా కలిపించిన కథ ‘RRR’.

పాత్రల విషయానికి వస్తే.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. మరి వీరికి జోడీగా ఎవరంటే… రాంచరణ్  సరసనా అలియా భట్  టాలీవుడ్ లోకి  అరంగేట్రం చేస్తుంది. సీతగా ఒక బలమైన పాత్ర పోషించి కథను మలుపు తింపడంలో అలియా భట్ నటిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా హాలీవుడ్ నుంచి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ని డంప్ చేస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవగణ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అజయ్ దేవగణ్ పై ఇప్పటివరకు వచ్చిన రూమర్ ప్రకారం అజయ్ ది ప్రతినాయకుడి పాత్ర మాత్రం కాదట. ఇక తమిళ నటుడైన సముద్రఖని కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడట . ఇంత స్టోరీ విన్నాక సినిమా ఇప్పుడాని ఇంట్రెస్ట్ పెరిగిందనుకుంటా… కాని 2020 జూలై 30 తేదీ వరకు మనందరమూ వెయిట్ చేయాల్సిందేనని రాజమౌళి చెప్పారు.