తుంటికీలు ఆప‌రేష‌న్ విక‌టించి ప్ర‌ముఖ చెఫ్ మృతి..!

0
134

తుంటికీలు మార్పిడి ఆప‌రేష‌న్ చేయించుకునేందుకు వెళ్లిన భార‌త్‌కు చెందిన ఓ చెఫ్ దేశం కాని దేశానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. కాగా, ముంబైకు చెందిన 42 ఏళ్ల బెట్టీ రీటా ఫెర్నాండేజ్ చెఫ్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు గాంచారు. బెట్టీస్ కేక్స్ టేల్స్ పేరుతో ఫెర్నాండేజ్ సొంతంగా ఓ బేక‌రీ, కిరాణా దుకాణం న‌డుపుతున్నారు. అయితే, బెట్టీకి పుట్టుక‌తోనే కుంటికీలు ప‌క్క‌కు జ‌రిగింది.

దీంతో ఆమె నిత్యం ఇబ్బందిప‌డేవారు. దీంతో ఆప‌రేష‌న్ చేయించుకోవాలనుకున్న బెట్టీ ఈ నెల 9వ తేదీన దుబాయ్‌లోని ఆల్ జెఫ్రా ఆస్ప‌త్రిలో చేరారు. ఆర్థోపెడిక్ సర్జ‌న్ స‌నిహ్య్ త‌ర‌జిత్ నేతృత్వంలో దాదాపు రెండు గంట‌ల‌పాటు బెట్టీకి ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. అయితే, బెట్టీకి చికిత్స జ‌రుగుతుండ‌గానే ఆమె మర‌ణించిన‌ట్టు వైద్యులు తెలిపారు.