టిక్ టాక్‌పై భార‌త్‌లో నిషేధం..!

0
130

సోష‌ల్ మీడియా సంచ‌ల‌నం చైనా యాప్ టిక్‌టాక్‌కు మ‌రో షాక్ త‌గిలింది. ఇటీవ‌ల కాలంలో మ‌ద్రాస్ హైకోర్టు బ్యాన్, సుప్రీం కోర్టు ఆదేశాలు, కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు నేప‌థ్యంలో టిక్‌టాక్ యాప్‌ను గూగుల్ బ్యాన్ చేసింద‌ని రాయిట‌ర్స్ రిపోర్టు చేసింది.

టిక్‌టాక్ యాప్‌ను నిషేధించాల‌నే కోర్టు ఆదేశాల‌కు అనుగుణంగా గూగుల్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. టిక్‌టాక్ యాప్ నిషేధంపై స్టే విధించ‌లంటూ చైనాకు చెందిన బైట‌న్స్ టెక్నాల‌జీ అభ్య‌ర్ధ‌న‌ను సుప్రీం కోర్టు తిర‌స్క‌రించిన కొన్ని గంట‌ల త‌రువాత టిక్‌టాక్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొల‌గిస్తూ ఆ సంస్థ యాజమాన్యం చ‌ర్య‌లు తీసుకుంద‌.ఇ

టిక్‌టాక్‌, హ‌లో యాప్‌లు దేశ వ్యాప్తంగా టీనేజ‌ర్లు, యువ‌త‌పై దుష్ప్ర‌భావాన్ని చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల ముందే టిక్‌టాక్‌లో అభ్యంత‌ర‌క‌ర వీడియోలు ఉన్నాయంటూ దాదాపు ఆరు మిలియ‌న్ వీడియోల‌ను టిక్ టాక్ యాజ‌మాన్యం తొల‌గించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న యాప్‌ల‌లో గూగుల్‌, యాపిల్ త‌రువాత టిక్‌టాక్ మూడో స్థానంలో కొన‌సాగుతోంది.