బాల‌కృష్ణ డైలాగ్‌ల‌తో రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే..!

0
232

ఇటీవ‌ల కాలంలో ఏపీ రాజ‌కీయ నేత‌లనోట టాలీవుడ్ సినీ స‌న్నివేశాల‌కు సంబంధించిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌లు గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. మొన్న‌టికి మొన్న రాష్ట్ర నీటిపారుద‌ల‌శాఖ మంత్రి అనీల్ కుమార్ యాద‌వ్ అసెంబ్లీలో సాక్షిగా ప్ర‌తిప‌క్ష టీడీపీ స‌భ్యుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఎప్పుడొచ్చామ‌ని కాద‌న్నా.. బుల్లెట్ దిగిందా..? లేదా..? అంటూ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ – టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు కాంబోలో వ‌చ్చిన పోకిరి సినిమా డైలాగ్‌ను పేల్చారు. తాజాగా మ‌రో వైసీపీ ఎమ్మెల్యే అచ్చం అనీల్‌కుమార్ యాద‌వ్ ఫైర్‌ను యాడ్ చేసి మ‌రీ చెప్పారు. కాక‌పోతే అది హీరో బాల‌కృష్ణ డైలాగ్‌..! ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే..!

కాగా, ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు స్పీక‌ర్ మాట‌ల‌ను గుర్తుచేశారు. అసెంబ్లీ నిర్వ‌హ‌ణ‌కు అడ్డుప‌డితే ప్ర‌తిప‌క్షానికి మీరు అవ‌కాశం ఇవ్వ‌న‌న్న మాట స‌బ‌బేని, స‌భ‌లో స‌మ‌య‌పాటించాల‌న్న సౌల‌భ్యం కోస‌మే మీరు అన్నారు అంటూ స్పీక‌ర్ మాట‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపారు.

స‌భ‌ను స‌క్ర‌మంగా న‌డ‌పాల‌న్న ఆలోచ‌న‌తో స్పీక‌ర్ అన్న మాట‌ల‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష స‌భ్యుడు చంద్ర‌బాబు వ‌క్రీక‌రిస్తూ స‌భ సాంప్ర‌దాయంలో లేని దాన్ని ఎలా మీరు సృష్టిస్తారండీ..? మీరేం మాట్లాడుతున్నారు..? అన్న‌టువంటి బెదిరింపు ధోర‌ణితో మాట్లాడార‌న్నారు. చంద్ర‌బాబు బెదిరిస్తే బెదిరిపోయేవారు స‌భ‌లో ఎవ్వ‌రూ లేరూ..! అంటూ నువ్వు బెదిరిస్తే బెదిరిపోవ‌డానికి ఓట‌ర్‌ని అనుకుంటున్నావా.. షూట‌ర్‌ని కాల్చిపారేస్తా అంటూ బాల‌కృష్ణ చెప్పిన డైలాగ్‌ను అంబ‌టి రాంబాబు గ‌ర్తు చేశారు.