బాల‌కృష్ణ ఓడితే.. టీడీపీలో జ‌రిగేది ఇదేన‌ట‌..!

0
185

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రికొన్ని గంటల్లో వెల్ల‌డికానున్న సంగ‌తి తెలిసిందే. దాంతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్ధుల భ‌విత‌వ్యం తేల‌నుంది. ఇదిలా ఉండ‌గా, అస‌లు ఏపీలో టీడీపీ మ‌ళ్లీ అధికారంలోకి వస్తుందా..? రాదా..? అన్న చ‌ర్చ‌తోపాటు హిందూపురం కేంద్రంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో విశ్లేష‌ణ‌లు కొనసాగుతున్నాయి. హిందూపురం టీడీపీ కంచుకోట కావ‌డం, ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా బాల‌కృష్ణ మ‌ళ్లీ బ‌రిలో నిల‌వ‌డం వంటి అంశాలు చ‌ర్చ‌కు దారి తీశాయి.

అయితే, పోలింగ్‌కు ముందు హిందూపురం ప్ర‌జ‌లు ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌పై గుర్రుగా ఉన్నారంటూ పలు ప్ర‌ధాన ప‌త్రిక‌లు క‌థనాల‌ను ప్ర‌చురించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బాల‌కృష్ణ మ‌ళ్లీ గెలుస్తాడా..? లేదా..? అన్న చ‌ర్చ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఒక‌వేళ బాల‌కృష్ణ ఓడితే టీడీపీ కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని చేజార్చిన వ్య‌క్త‌గా మిగిలిపోతాడ‌న్న వాద‌నా వారి నుంచి విన‌ప‌డుతోంది.