‘భళ్లాలదేవ జయహో.. జయహో’.. ఫాన్స్ కోసం మళ్ళీ ..!

0
107
Raana daggubati
tokyo theatre in bhuhubali movie Raana daggubati

దర్శక దీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి కేవలం భారత దేశం మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సినిమా . అందులో ప్రధానంగా జపాన్ లో ఈ చిత్రానికి విపరీతమైన ఆదరణను పొందింది. జపాన్ లోని ప్రజలంతా కేవలం సినిమా పైనే కాదు , అందులోని నటీనటుల మీద ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. గత సంవత్సరం జరిగిన ‘టోక్యో కామిక్ కాన్’ వేడుకలకు రానా జపాన్ హాజరై అక్కడి అభిమానులతో కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకుని వాటిని సోషల్ మీడియా లో పంచుకున్న విషయం అందరికి తెలిసిందె. అంతే కాకుండా జపాన్‌లో అత్యధిక రోజులు ప్రదర్శించబడిన భారత చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఈ సంవత్సరము టోక్యోలో అభిమానులందరి కోసం ఆదివారం రోజున బాహుబలి ప్రత్యేకంగా స్క్రీనింగ్ ను ఏర్పాటు చేశారు. అక్కడి ప్రజలు రానా నటనకు, ఫిదా కాబడిన అభిమానులు ‘రానా దగ్గుబాటి జయహో.. జయహో.. భల్లాలదేవ జయహో జయహో .. ‘సంబరంతో గోల చేస్తూ, కేకలు పెట్టారు. దీనిని అంతా వీడేమో తీసి అభిమాని పోస్ట్ చేయగా, సామజిక మాధ్యమంలో తెగ హల్చల్ చేస్తుంది.

థియేటర్‌లో స్క్రీనింగ్ చూస్తున్న ప్రేక్షకులు ‘దగ్గుబాటి రానా జయహో…. భళ్లాల దేవ జయహో.. జయహో..’ రచ్చచేస్తూ అభిమాన నటుడి రానా కోసం.. రంగు రంగుల కాగితాలు విసురుతూ థియేటర్‌ మొత్తం హంగామా చేశారు. మరి కొంత మందైతే ‘బాహుబలి’ చిత్రం లోని వివిధ పాత్రల గెటప్‌లలో తయారయ్యి తెగ సందడి చేశారు. .బాహుబలి చిత్రం జపాన్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించింది.