భ‌గ్గుమ‌న్న ఫ్యాక్ష‌న్ : ఎమ్మెల్యే అభ్య‌ర్థిపై వేట కొడ‌వ‌ళ్ల‌తో దాడి..!

0
223
MLA Attacked with Candidates Attacking Candidates!c
tdp leader thikka reddy latest news

క‌ర్నూలు జిల్లాలో మ‌రోసారి ఫ్యాక్ష‌న్ క‌క్ష‌లు భ‌గ్గుమ‌న్నాయి. మంత్రాల‌యం టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి తిక్కారెడ్డిపై ప్ర‌త్య‌ర్ధులు వేట కొడ‌వ‌ళ్ల‌తో దాడి చేశారు. ఈ దాడిలో తిక్కారెడ్డికి తీవ్ర గాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సంఘ‌ట‌న‌కు సంబంధించి స్థానికులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

కాగా, మంత్రాల‌యం టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి తిక్కారెడ్డి ఇవాళ క‌గ్గ‌ల్లు గ్రామంలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లార‌ని, తిక్కారెడ్డి రాక‌ను తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి అనుచ‌రులు దాడికి పాల్ప‌డ్డార‌న్నారు. తిక్కారెడ్డిపై వైసీపీ శ్రేణుల దాడిని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరువ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం దాడుల‌కు దిగాయి.

తిక్కారెడ్డిపై దాడిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన ఎస్సైతోస‌హా ప‌లువురు పోలీసుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మార‌డంతో పోలీసులు ఆరు రౌండ్లు గాల్లో కాల్పులు జ‌రిపారు. దీంతో క‌గ్ల‌ల్లు గ్రామంతో స‌హా మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గంలో ఉద్రిక్త‌ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.