అయ్య‌ప్ప స‌న్నిధానంలో మ‌హిళ‌.. ఈమెదీ 50 ఏళ్ల‌లోపే..!

0
170

శ‌బ‌రిమ‌ల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఆల‌యంలోకి మ‌హిళ‌లు ప్ర‌వేశించ‌డాన్ని హిందూత్వ వాదులు చేస్తున్న ఆందోళ‌న‌కు కౌంట‌ర్‌గా వామ‌ప‌క్షాలు కూడా నిర‌స‌న‌లు చేస్తున్నాయి. దీంతో కేర‌ళ అంత‌టా ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

అయితే, నిన్న బీజేపీ కార్య‌క‌ర్త‌లు నిర్వ‌హించిన ఆందోళ‌న‌ల్లో ఓ వ్య‌క్తి మృతి చెందిన విష‌యం తెలిసిందే. వామ‌ప‌క్షాల‌కు చెందిన ఓ వ్య‌క్తికి తీవ్ర గాయాల‌య్యాయి. అంతేకాకుండా, నిన్న ఆదోర్‌లో ప‌ది మంది వామ‌ప‌క్ష నాయ‌కుల ఇళ్ల‌పై దాడులు జ‌రిగాయి. దీంతో అక్క‌డ ప‌రిస్థితి అదుపు త‌ప్పింది.

ఇవాళ కూడా కేర‌ళ అంత‌టా ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. ఆదోర్‌లోని ఓ సెల్‌ఫోన్ షాపుపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు బాంబుదాడి చేశారు. ఇందులో న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు వైద్యులు తెలిపారు. ఆందోళ‌న కారుల దాడుల‌తో షాపుల‌ను మూసేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌కు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉండ‌గా, మ‌రో మ‌హిళ అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకుంది. త‌న భ‌ర్త‌తో క‌లిసి శ‌బ‌ర‌మ‌ల అయ్య‌ప్ప దేవ‌స్థానంలోని 18 మెట్ల‌ను ఎక్కి స్వామివారిని ద‌ర్శించుకుంది. ఆమె వ‌య‌స్సు 50 ఏళ్ల సంవ‌త్స‌రాల‌ని, అందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు మ‌హిళ‌లే అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకోగా, తాజాగా మ‌రో మ‌హిళ ఆ లిస్టులో చేరింది.