తెలుగు ప్రేక్షకుల కోసమే ఈ నిర్ణయం : హీరో విశాల్

0
78
vishal ayogya

డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘టెంపర్’. ఈ చిత్రాన్ని తమిళంలో మాస్ మహారాజ విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేశాడు. ఈ మధ్యే అక్కడ విడుదలై భారీ వసూళ్లను రాబడుతుంది. తెలుగు సినిమా రీమేక్ కాబట్టి తెలుగులోకి డబ్ చేయడం కుదరదని విశాల్ వెల్లడించాడు.

కానీ తాజా సమాచారం ప్రకారం అయోగ్య ను తెలుగులోకి డబ్ చేయాలని నిర్ణయించుకున్నారట. తమిళ చిత్రం కథలో కొంత మార్పు చేసి లాస్ట్ అరగంటలో కీలకమైన సందేశ సన్నివేశాన్ని చిత్రీకరించారట. మార్చబడిన ఈ క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింప చేసిందట. మార్కులు కొట్టేసిన క్లైమాక్స్ ప్రేక్షకులను తిరిగి థియేటర్స్ కి రప్పిస్తుందట. ఆ కారణంగానే చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారని వార్తలు. మల్కాపురం శివకుమార్ తెలుగు డబ్బింగ్ రైట్స్ ను కైవసం చేసుకున్నారు.