ఆస్ట్రేలియాలో ఎన్నారై డాక్టర్ ప్రీతి రెడ్డి దారుణ హత్య

0
415
NRI doctor preethi reddy murde

ఆస్ట్రేలియాలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన హైదరాబాద్ చెందిన డాక్టర్ ప్రీతి రెడ్డి దారుణ హత్యకు గురైనారు. ఈ నెల సిడ్నీలో అదృశ్యమైన ప్రీతి రెడ్డి మూడు రోజుల తర్వాత తన కారులోనే శవమై కనిపించారు. ప్రీతి రెడ్డి ని కత్తి తో పొడిచి చంపేసిన  దుండగులు ఆమె మృత దేహాన్ని సూట్కేస్ లో పెట్టి సౌత్ వేల్స్ ప్రాంతములో వొదిలేసి పోయారు. అయితే ఆమె మృత దేహం దొరికిన కొద్దీ గంటలోనే ప్రీతి రెడ్డి మాజీ ప్రియుడు హర్షవర్ధన్ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే ప్రీతి రెడ్డి మాజీ ప్రియుడే ఈ హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ కు చెందిన ప్రీతి రెడ్డి ఆస్ట్రేలియాలో డెంటిస్ట్ గా పనిచేస్తున్నారు. అయితే ఆదివారం సెయింట్‌ లియోనార్డ్స్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌కు హాజరవ్వడానికి వెళ్లిన ప్రీతి రెడ్డి అప్పటి నుంచి కనబడకుండా పోయారు.తాను చివరిసారిగా తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రీతి రెడ్డి 11 గంటల వరకు ఇంటికి చేరుకుంటాన్నని చెప్పినట్టు తెలిసింది. కానీ టైం గడుస్తున్న ప్రీతి రెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రలు పోలిసుల కు పిర్యాదు చేసారు. వెంటానే ఆమె కనిపించకుండా పోయిన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. సిడ్నీలో ఎంతో రద్దీగా ఉండే జార్జ్ స్ట్రీట్ లో మెక్‌ డోనాల్డ్‌స్ రెస్టారెంట్ దగ్గర ప్రీతి చివరిసారిగా కనిపించినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు తెలుసుకున్నారు. ఆమెతో పాటు ప్రియుడు హర్షవర్ధన్ కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమె కోసం గాలించారు. చివరకు మూడు రోజుల తరువత ప్రీతి రెడ్డి ఆమె కారులోనే శవమై కనిపించారు.