బాబు పోరాటానికి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది : కేజ్రీవాల్‌

0
86

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన “ధర్మపోరాట దీక్ష”కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. నిజనైకి ఈ దీక్షకు ఇంత పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని ప్రదాని మోధి సైతం ఊహించి ఉండదు.. వివిధ జాతీయ పార్టీల నాయకులు బాబు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మొదలుకొని, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్‌, శరద్‌ యాదవ్‌, ఎస్పీ నేత ములాయం, అరవింద్‌ కేజ్రీవాల్‌ లాంటి తదితర ముఖ్య నేతలు దీక్షకు మద్దతు పలికారు.

ఈ సందర్భంగా డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ మోధి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. APకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆ “తిరుపతి వెంకటేశ్వర స్వామి” సాక్షిగా హామీ ఇచ్చిన ప్రధాని మోదీ హామీలను అమలు చేయకుండా ఆంద్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

అలాగే మనదేశం మొత్తంలో అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీని మించిన వారు లేరని ఆరోపించిన కేజ్రీవాల్‌.. మోధి గారు అనుకుంటున్నట్లు ఆయన ఒక పార్టీకి మాత్రమే ఆయన ప్రదాని కాదని.. యావత్‌ దేశానికి ప్రధాని అన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. మరీ ముఖ్యంగా ఈ దేశంలో ఎవరు హక్కుల కోసం పోరాడినా CBI వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించిన ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చంద్రబాబు గారు చేస్తున్న ఈ పోరాటానికి “ఆమ్‌ ఆద్మీ పార్టీ” మద్దతు ఎప్పుడు ఉంటుందని భయిరంగంగానే ప్రకటించాడు.