గల్లా జయదేవ్” అకౌంటెండ్ ఇంట్లో ఐటీ దాడులు : అరుణ్ జైట్లీ వివరణ..!

0
91
గల్లా జయదేవ్” అకౌంటెండ్ ఇంట్లో ఐటీ దాడులు : అరుణ్ జైట్లీ వివరణ..!
గల్లా జయదేవ్” అకౌంటెండ్ ఇంట్లో ఐటీ దాడులు : అరుణ్ జైట్లీ వివరణ..!

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నడూ లేనివిదంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ఐటీ దాడులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో బాగంగానే నిన్న TDP నేత “గల్లా జయదేవ్” అకౌంటెండ్ అయిన “గుర్రప్ప నాయుడు” ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. ఈ ఘటనతో తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి, BJP నేత “అరుణ్ జైట్లీ” మీడియా ముందుకు వచ్చారు.

ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “అవినీతికి వ్యతిరేకంగా ఐటీ శాఖ చేపట్టే ఎలాంటి చర్యనైనా రాజకీయ కక్షసాధింపు చర్యగా పరిగణిస్తున్నారు.. అవినీతికి పాల్పడ్డ వారిపై మాత్రమే ఐటీ దాడులు జరుగుతుంటే వేధిస్తున్నారని చెప్పడం ఎంతమాత్రం సరికాదు.. ఇలా దిగజారి మాట్లాడటం కేవలం విపక్షాలకే చెల్లింది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు “అరుణ్ జైట్లీ”.