ఏపీ ఆర్టీసీ విలీనంపై సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

0
474

ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్ర‌భుత్వంలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. మ‌రోప‌క్క‌ విలీన ప్ర‌క్రియ‌పై చ‌ర్చించాల‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ఆర్టీసీ విలీన ప్ర‌క్రియ‌కు సంబంధించి ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్ధం చేసిన ర‌వాణ‌శాఖ ఆ వివ‌రాల‌ను సోమ‌వారం లేదా మంగ‌ళ‌వారం నాడు కేబినేట్ ముందుకు పంప‌నుంది. ఆర్టీసీ విలీనానికి సంబంధించి నిపుణుల‌తో ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసి నిర్ణ‌యం తీసుకునే యోచ‌న‌లో సీఎం జ‌గన్ ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే, ఏపీ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామంటూ సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.