నిమ్మ సోడా తాగుతున్నారా? అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి

0
383
hyderabad latest video 2019

వేసవి వచ్చిందంటే ఎండలు మండిపోతుంటాయి. చల్ల చల్లగా ఏదైనా కూల్ డ్రింకో, నిమ్మ రసమో, సోడా నో ఏదోకటి తాగి దప్పిక తీర్చుకోవాలనిపిస్తుంది. ఇక ఈ టైం లో చల్లటి పానీయాలకు డిమాండ్ పెరిగిపోతుంది. ఈ సమయంలో వ్యాపారం చేస్తే చాలు పైసలు మస్తుగా వస్తాయనుకుని, చిరు వ్యాపారులు తెగ పుట్టుకొస్తారు. ఇక రోడ్డు లకు ఇరువైపులా దగ్గర, దగ్గరలోనే తోపుడు బండ్లను పెట్టుకొని చేస్తుంటారు.

దాహం వేస్తే చాలు సామాన్య ప్రజలు వీధులలో ఉండే తోపుడు బండ్లను ఆశ్రయిస్తుంటారు. చాలా మంది ఆలోచనల ప్రకారం ఎలాంటి కెమికల్ లేకుండా నిమ్మ రసమే ఉంటుందని, దీనికి మాత్రమే స్వచ్ఛమైన నీటిని వాడతారని భావిస్తారు. కేవలం పది రూపాయలకే నిమ్మరసం దొరుకుతుంది. మన కళ్ల ముందే చేస్తాడు అని అనుకుంటారు. ఇలా అనుకుంటే ఇక మీరు బోల్తా పడ్డట్లే .. మీ చేతులతో మీరే అనారోగ్యాన్ని కొనుక్కొన్నట్లు.

నేను చెప్పే వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే తప్పకుండా మీరు ఈ వీడియోను చూడాల్సిందే.. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఒక చిరు వ్యాపారి సోడా బండిని పెట్టుకొని నడిపించుకుంటున్నాడు. సోడాలో వినియోగించే నీరు కోసం ఆ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే అందరు విస్తుపోవల్సిందే.

ట్యాంక్ బండ్ దగ్గరలో ఫ్లైఓవర్ సమీపంలో  నున్న మొక్కలకు నీళ్లు పట్టుతున్న మహిళా దగ్గరకు ఒక డబ్బా తీసుకెళ్లి పెట్టాడు. ఆమె వెంటనే డబ్బా నిండా నీటిని పట్టింది. అతను ఆ డబ్బా తీసుకొని సోడా బండి దగ్గరకు.. నిమ్మ సోడాలు అమ్ముకునేందుకు వెళ్ళాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమం లో వైరల్ అవుతుంది. మీరు ఇప్పటికే చూసి ఉంటె ఓకే. లేదంటే చూసి సోడా బండి దగ్గరకు వెళ్లాలో? లేదో ? నిర్ణయించుకోండి.