ఉగాది పర్వదినాన పక్క ప్లాన్ తో వస్తున్న జ‌గ‌న్ : ప్రత్యర్థులకు చెమటలేనా..?

0
233
ఉగాది పర్వదినాన పక్క ప్లాన్ తో వస్తున్న జ‌గ‌న్ : ప్రత్యర్థులకు చెమటలేనా..?
ఉగాది పర్వదినాన పక్క ప్లాన్ తో వస్తున్న జ‌గ‌న్ : ప్రత్యర్థులకు చెమటలేనా..?

త‌న సుడిగాలి పర్య‌ట‌న‌తో ఆంధ్ర రాష్ట్రం మొత్తం చుట్టేసి జ‌గ‌న్‌… ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఈ ఉగాది పర్వదినాన బయటపెట్టనున్నాడు. అదే YCP మేనిఫెస్టో విడుదల ప్రక్రియ. సుదీర్ఘంగా, స‌మ‌గ్రంగా చేస్తున్న మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న విడుద‌లైన నేప‌థ్యంలో.. ఈ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తంగా ఉగాది రోజును ఖరారు చేశారు జ‌గ‌న్.

అన్ని వ‌ర్గాల‌కు మేలు చేసేలా మొత్తం 31 మందితో మేనిఫెస్టో కమిటీని నియమించారు జగన్. సీనియ‌ర్ నేత “ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు” చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో సీనియర్ నేతలు ధర్మాన, బోత్స, మేకపాటితో పాటు పలువురికి చోటు కల్పించారు. వాగ్ధానాల విషయంలో ఏ పార్టీతో పోటీ పడకుండా నిజాయితీగా మేనిఫెస్టో రూపొందించాలని మేనిఫెస్టో కమిటీకి ఇప్పటికే చెప్పేశారు జగన్.

ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు, నవరత్నాలన్నింటిని ఈ మేనిఫెస్టోలో పొందుపరుస్తూ రూపొందించినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు గారిలా గెలవడానికి మాత్రమే సాధ్యం కానీ హామీలను మేనిఫెస్టోలో చేర్చకుండా జాగ్రత్త పాడాలని కమిటీ మెంబర్స్ కి సూచించారు జగన్. అంటే ఈ ఉగాది పర్వదినానా అసలు సిసలైన.. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితల్లో వెలుగునింపే YSRCP పార్టీ మేనిఫెస్టో విడుదల కానుందనమాట.

Read Also: ఏపీలో భారీగా ప‌ట్టుబ‌డుతున్న న‌గ‌దు..!