వార‌సుల్ని ఈడ్చిత‌న్నిన జ‌నాలు

0
104

వార‌స‌త్వ‌రాజకీయాల‌కు భ‌విష్య‌త్ క‌నిపించేలా లేదు. 2019 ఏపీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల్లో బీభ‌త్స‌మైన ప‌రిణితి క‌నిపించింది. ఎన్ని కోట్లు పెట్టినా ఓట‌ర్ ని కొన‌లేక‌పోయారు నేత‌లు. వాళ్లేమ‌నుకున్నారో అదే చేసి చూపించారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో వార‌సుల ఆట‌లు దాదాపు సాగ‌నివ్వ‌లేదు ఏపీ జ‌నాలు. సాక్షాత్తూ చంద్ర‌బాబు త‌న‌యుడ్నే కాద‌న్నారు. ఎర్రన్నాయుడు, ఎన్టీఆర్‌ కుటుంబం మినహా టీడీపీలో వారసులంతా ఓటమి పాలైపోయారు. చంద్రబాబు, మంత్రులు కేఈ, పరిటాల, జేసీ సోద‌రుల‌ సంతానానికి మొహం చాటేశారు.

దివంగత ఎర్రన్నాయుడు కుటుంబం నుంచి ఆయన కుమారుడు రామ్మోహన్‌నాయుడు, కుమార్తె ఆదిరెడ్డి భవాని, ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు, హిందూపురం నుంచి ఎన్టీఆర్‌ కుమారుడు బాలకృష్ణ మినహా అందరూ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్‌, మంత్రులు పరిటాల సునీత, కేఈ కృష్ణమూర్తి కుమారులు పరాజయాన్ని చవిచూశారు. జేసీ సోదరుల తనయులూ ఓడిపోయారు.