ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌..!

0
186

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను ఈ రోజు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి విడుద‌ల చేశారు. కాగా, ప‌రీక్ష‌కు 6 ల‌క్ష‌ల 20 వేల మంది విద్యార్థులు హాజ‌రుకాగా, మొత్తంగా 94.88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించార‌ని తెలిపారు. అందులో బాలుర ఉత్తీర్ణ‌త శాతం 94.68గా ఉండ‌గా, బాలిక‌ల ఉత్తీర్ణ‌త శాతం 95.09గా ఉంది. మొత్తంగా 5400 స్కూళ్ల‌లో విద్యార్ధులు వంద‌కు వంద శాతం ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్టు విద్యాశాఖ క‌మిష‌న‌ర్ తెలిపారు. ఫ‌లితాల ప‌రంగా మొద‌టి స్థానంలో తూర్పు గోదావ‌రి జిల్లా ఉండ‌గా, చివ‌రి స్థానంలో నెల్లూరు జిల్లా ఉంది.