సీఎం జ‌గ‌న్‌తో వ‌ల్ల‌భ‌నేని వంశీ భేటీ.. మీరు ఒప్పుకుంటే..!

0
338

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో గ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ కాసేప‌టి క్రితం స‌మావేశమ‌య్యారు. వీరిద్ద‌రి భేటీలో గ‌న్న‌వ‌రం మీదుగా వెళ్లే పోల‌వ‌రం కుడికాల్వను ఆనుకుని ఉన్న గ్రామాల రైతుల స‌మ‌స్య‌లు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. పోల‌వ‌రం కుడి కాల్వ నుంచి రైతుల‌కు సాగునీరు, గ్రామ‌స్తుల‌కు తాగునీరు అందించేందుకు ప్ర‌భుత్వ‌ప‌రంగా స‌హాయం అందించాల‌ని, అలాగే రైతుల సాగుకు అవ‌స‌ర‌మైన నీరు స‌ర‌ఫ‌రా చేసేందుకు విద్యుత్‌ను ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారారు.

మీరు ఒప్పుకుంటే రైతుల కోసం తన సొంత నిధుల‌తో ఏర్పాటు చేసిన 500 మోటార్ల‌ను ప్ర‌భుత్వానికి అప్ప‌గిస్తాన‌ని, వాటి ద్వారా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేసేందుకు ప్ర‌భుత్వ స‌హ‌క‌రించాల‌ని సీఎం జ‌గ‌న్‌ను వ‌ల్ల‌భ‌నేని వంశీ కోరారు. గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా అధికారంలో ఉన్న టీడీపీ ప్ర‌భుత్వం కూడా పోల‌వ‌రం కుడికాల్వ స‌మీపంలోని రైతుల‌కు, గ్రామ‌స్తుల‌కు నీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో ఉచిత విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేసింద‌ని వ‌ల్ల‌భ‌నేని వంశీ జ‌గ‌న్‌కు అంద‌జేసిన లేఖ‌లో గుర్తు చేశారు.