బిగ్ హీట్‌ స‌ర్వే : తాజా.. తాజా లెక్క‌ల‌తో ఏపీలో సెగ‌లు పుట్టిన్న మ‌రో పొలిటీషియ‌న్‌..!

0
372

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి ఫ‌లితాలు వెలువ‌డేందుకు 15 రోజుల గ‌డువు ఉన్న నేప‌థ్యంలో ఆటు పోటీచేసిన అభ్య‌ర్ధుల‌తోపాటు, ఇటు రాజ‌కీయ విశ్లేష‌కులు, ప్ర‌జ‌లు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే క్ర‌మంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా సెఫాల‌జిస్ట్‌లు విడుద‌ల చేసే ఫ‌లితాలు ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఒక‌రు ఏపీ ప్ర‌జ‌లు మ‌ళ్లీ టీడీపీకే ప‌ట్టం క‌ట్టార‌ని ఫ‌లితాలు వెల్ల‌డించ‌గా, మ‌రొక‌రు కొత్త ప్ర‌భుత్వాన్ని కోరుకునే క్ర‌మంలో ఏపీలో వైసీపీ ప్ర‌భంజ‌నం ఉంటుంద‌ని లెక్క‌లు చెబుతున్నాయి.

ఇలా విడుద‌ల‌వుతున్న స‌ర్వేల‌లో.., ఏ స‌ర్వేను నమ్మాలో తెలియ‌ని స్థితిలో ప్ర‌జ‌లు ఉన్నార‌న‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన స‌ర్వేల‌లో ఎక్కువ శాతం వైసీపీ అధికారం చేప‌ట్ట‌నుంద‌ని, వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారంటూ ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

కాగా, తాజాగా మ‌రో స‌ర్వే ఏపీ రాజ‌కీయాల్లో సెగ‌లు పుట్టిస్తోంది. అది కూడా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీదర్‌రావు వెల్ల‌డించారు. ఈ రోజు సాయంత్రం ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ముర‌ళీధ‌ర్‌రావు ఏపీకి సంబంధించిన ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు. మే 23న వెలువ‌డ‌నున్న ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 అసెంబ్లీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుని అధికారం చేప‌డుతుంద‌ని, ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ప‌క్కా అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.