టీడీపీలోకి మ‌రొక‌రు : క‌డ‌ప జిల్లా నుంచి.. ఎవ‌రో తెలుసా..?

0
585

ఆదివారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు విడుద‌లైన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఎగ్జిట్‌పోల్స్‌కు సంబంధించి రాజకీయ వ‌ర్గాల్లో భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఎక్కువ శాతం ఎగ్జిట్‌పోల్స్ వైసీపీకి మొగ్గు చూపినా, ఆ సంస్థ‌లు గ‌తంలో చేసిన స‌ర్వేల‌న్నీ కూడా ఫెయిల్ అయ్యాయ‌ని, ప్ర‌జ‌ల‌నాడిని ప‌ట్టించుకోకుండా చేసిన స‌ర్వే లెక్క‌లు మ‌ళ్లీ త‌ప్ప‌నున్నాయంటూ టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.

గ‌తంలో నిజ‌మైన ఎగ్జిట్‌పోల్స్‌ను రిలీజ్ చేసిన సంస్థ‌లు.., ఈ ద‌ఫా టీడీపీకి అనుకూలంగా ఫ‌లితాల‌ను వెల్ల‌డించాయ‌ని, టీడీపీనే మ‌ళ్లీ అధికారంలోకి రానుందని, చంద్ర‌బాబు మ‌ళ్లీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు ప్ర‌త్య‌ర్ధి పార్టీ శ్రేణులకు కౌంట‌ర్ ఇస్తున్నారు.

ఇలా టీడీపీ శ్రేణులు ఎగ్జిట్‌పోల్స్ జోష్‌లో ఉండ‌ట‌మే కాకుండా, త‌మ నేత చంద్ర‌బాబు మే 25న మ‌ళ్లీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారంటూ ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి పార్టీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేలు సీఎం చంద్ర‌బాబును ప్ర‌మాణ స్వీక‌ర వేదిక‌పై క‌లుస్తారని వారు చెబుతున్నారు.

అలా ప్ర‌మాణ స్వీకార వేదిక‌గా సీఎం చంద్ర‌బాబును క‌లిసే ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి పార్టీ నేత‌ల్లో ఒక‌రు క‌డ‌ప జిల్లాకు చెందిన ప్ర‌ముఖ సీనియ‌ర్ రాజ‌కీయ నేత ఉన్న‌ట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల్లో గ‌త ప‌దేళ్లుగా హుందాగ‌ల నేత‌గా ప్ర‌జ‌ల్లో పేరు సంపాదించ‌డ‌మే కాకుండా, మే 23న వెలువ‌డ‌నున్న ఎన్నిక‌ల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంద‌నున్నార‌ని సమాచారం. క‌డ‌ప జిల్లాలో టీడీపీ ప్ర‌త్య‌ర్ధిగా ఉన్న ఆయ‌న మే 23 త‌రువాత చంద్ర‌బాబు స‌మక్షంలో పార్టీ మార‌నున్నార‌న్న‌ది తాజా స‌మాచారం.