ఏపీ సంచ‌ల‌న స‌ర్వే అవుట్‌.. ఎవ‌రికెన్ని సీట్లో తెలుసా…?

0
517

ఏపీ సార్వ‌త్రి ఎన్నిక‌ల్లో భాగంగా నోటిఫికేష‌న్ విడుదలైన నాటి నుంచి దాదాపు మూడు నెల‌ల‌పాటు ప్ర‌ధాన పార్టీల‌న్నీ ప్ర‌చారాన్ని హోరెత్తించిన సంగ‌తి తెలిసిందే. త‌మ పార్టీ అభ్య‌ర్ధుల విజ‌య‌మే ల‌క్ష్యంగా అధినేత‌లు ప్ర‌చార ప‌ర్వాన్ని ముగించ‌గా, ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న విధంగానే ఏప్రిల్ 11న పోలింగ్ చెదురు, మ‌దురు ఘ‌ట‌న‌లు మిన‌హా అంతా ప్ర‌శాంతంగానే ముగిసింది. మ‌రోప‌క్క ఓట‌ర్ల తీర్పు ఎలా ఉండ‌నుంది..? అన్న అంశానికి సంబంధించి పార్టీల అధినేత‌లు రోజుకో స‌ర్వేను విశ్లేషిస్తూ ఒక అంచ‌నాకు వ‌స్తున్నారు. దీంతో త‌మ గెలుపోట‌ముల‌పై ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్ధుల్లో టెన్షన్ తారా స్థాయికి చేరింది.

ఈ నేప‌థ్యంలో ఏపీ ఎగ్జిట్‌పోల్స్‌కు సంబంధించి ఓ ప్ర‌ముఖ ఏజెన్సీ సంస్థ చేసిన స‌ర్వే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌హిళ‌లు, రైతులు, యువ‌త‌, ప‌ల్లెజ‌నం, ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు, మ‌తాలు, వ‌ర్గాలు ఇలా ఓట‌ర్లంద‌ర్నీ దృష్టిలో పెట్టుకున్న తాము ఈ స‌ర్వే చేయించామ‌ని వారు చెబుతున్నారు. ఆ స‌ర్వే లెక్క‌ల ప్రకారం వివ‌రాలు ఇలా ఉన్నాయి.