నెల్లూరు, బాప‌ట్ల పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఎమ్మెల్యే స్థానాల స‌ర్వే అవుట్‌..!

0
309

ఏపీ టీడీపీ ప్రధాన ప్రత్య‌ర్ధి పార్టీ సొంతగా ఒక స‌ర్వే చేయించింద‌ని, అలా ఆ పార్టీ చేయించిన స‌ర్వేలో షాకిచ్చే ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యాయంటూ ఓ క‌థ‌నం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక పోలింగ్‌లో నేప‌థ్యంలో ఏ అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీ అభ్య‌ర్ధి గెలుస్తారు..? ఏ నియోజ‌క‌వ‌ర్గంలో టైట్ ఫైట్ ఉండ‌నుంది..? అన్నది ఆ పార్టీ చేసిన స‌ర్వేలో స్ప‌ష్ట‌మైన‌ట్టు తెలుస్తుంది.

టీడీపీ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి పార్టీ చేయించిన సీక్రెట్ స‌ర్వేకు సంబంధించిన వివ‌రాలు లీకుల ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డంతో ఆ పార్టీ శ్రేణులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డార‌ని, ఆ వివ‌రాల ఆధారంగా ఓ ప్ర‌ముఖ ఛానెల్ క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింద‌ని స‌మాచారం.

నెల్లూరు పార్ల‌మెంట్ ప‌రిధిలో..
ఆత్మ‌కూరు : వైసీపీ
కావ‌లి : వైసీపీ
నెల్లూరు రూరల్ : టీడీపీ
కందుకూరు : ట‌ఫ్ ఫైట్‌
నెల్లూరు : ట‌ఫ్ ఫైట్‌
నెల్లూరు అర్బ‌న్ : ట‌ఫ్ ఫైట్‌
సూళ్లూరుపేట : ట‌ఫ్ ఫైట్‌

బాప‌ట్ల పార్ల‌మెంట్ ప‌రిధిలో
అద్దంకి : టీడీపీ
పర్చూరు : టీడీపీ
బాప‌ట్ల : టీడీపీ
సంత‌నూత‌ల‌పాడు : వైసీపీ
వేములూరు : టీడీపీ
రేప‌ల్లె : టీడీపీ
చీరాల : ట‌ఫ్ ఫైట్‌

అయితే, ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌లు స‌ర్వేలు వైర‌ల్‌గా మారిన సంగతి తెలిసిందే. అందులో కొన్ని స‌ర్వేలు వైసీపీకి అనుకూలంగా ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌గా, మరికొన్ని స‌ర్వేలు టీడీపీకి అనుకూలంగా ఫ‌లితాల‌ను వెల్ల‌డించాయి. తాజాగా విడుద‌లైన ఈ స‌ర్వే ఎంత‌మేర‌కు నిజ‌మ‌న్న‌ది తేలాలంటే మే 23వ తేదీ వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.