ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం..!

0
105

ఆంధ్రప్రదేశ్ గ‌వ‌ర్న‌ర్‌గా ఎవ‌రు నియ‌మితులు కానున్నారు..? అన్న ప్ర‌శ్న‌కు తెర‌దించుతూ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ తెరదించారు. కాగా, గ‌త వారం రోజుల క్రితం ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా కిర‌ణ్‌బేడీ నియ‌మితులు కానున్నార‌ని, ఆ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారంటూ ప‌లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. కానీ అవ‌న్నీ కూడా అవాస్త‌వాలేన‌ని కేంద్ర ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.

అయితే రాష్ట్ర‌పతి రామ్‌నాథ్ కోవింద్ తాజాగా జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా విశ్వ‌భూష‌ణ్ మారిచంద‌న్‌ను నియ‌మించారు. దీంతో ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ తెలంగాణ‌కే ప‌రిమితం కానున్నారు. అలాగే చ‌త్తీస్‌గ‌ఢ్ గ‌వ‌ర్న‌ర్‌గా అన‌సూయా యూకే నియ‌మితుల‌య్యారు.