డ్వాక్రా మ‌హిళ‌ల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌..!

0
184

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ కాసేప‌టి క్రితం అసెంబ్లీలో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. గ‌త రెండు నెల‌ల క్రితం జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో అధికారం చేప‌ట్టిన వైసీపీ తొలిసారి జ‌రుగుతున్న అసెంబ్లీలో రూ.2,27,974 కోట్ల‌తో ప్ర‌భుత్వ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌నాటి నుంచి అధికారంలోకి వ‌స్తే చేప‌డుతామంటూ చెప్తూ వ‌చ్చిన న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌కు సంబంధించి అమ‌లుకు అధిక ప్రాధాన్య‌త ఇచ్చింది. న‌వ‌ర‌త్నాల్లో పేర్కొన్న‌ట్టుగానే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు సున్నా వ‌డ్డీకే రుణాలు అందించేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముంద‌డుగు వేసింది.

డ్వాక్రా మ‌హిళ‌ల‌కు సున్నా వ‌డ్డీకే రుణాలు అమ‌లుకు సంబంధించి ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ అసెంబ్లీలో మాట్లాడుతూ రూ.1140 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు చెప్పారు. అలాగే స్వ‌యం స‌హాయ‌క బృందాల‌కు కూడా ల‌బ్ధిచేకూరేలా వ‌డ్డీలేని రుణాల‌ను అందించేందుకు వైఎస్ఆర్ వడ్డీలేని రుణాల కింద రూ.648 కోట్లు కేటాయించారు.