కంప్యూట‌ర్ బాబా ఏపీ స‌ర్వే : సంచ‌ల‌న ఫ‌లితాల రిపోర్టు రిలీజ్‌..!

0
328

ఏపీ సార్వ‌త్రి ఎన్నిక‌లు ముగిసి.., ఫ‌లితాలు వెలువ‌డేందుకు ఇంకా ఐదు రోజులు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో కంప్యూట‌ర్ బాబా రాష్ట్ర రాజ‌కీయాల‌పై తాజాగా చేసిన స‌ర్వే ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్‌టాపిక్ అయింది. అయితే, గ‌తంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో కంప్యూట‌ర్ బాబాకు మంత్రి హోదా క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే.

ఆ త‌రువాతి కాలం నుంచి ఆయ‌న‌కు కాంగ్రెస్ స‌న్నిహితంగా ఉంటూ వ‌స్తోంది. అదే క్ర‌మంలో ఆ పార్టీకి చెందిన కొంద‌రు ముఖ్య నేత‌లు ఎన్నిక‌ల్లో గెలుపు కోసం కంప్యూట‌ర్ బాబాతో వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు చేయిస్తూ వ‌స్తున్నారు. అలా కంప్యూట‌ర్ బాబా చేత పూజ‌లు చేయించుకున్న వారెవ్వ‌రు కూడా ఇంత వ‌ర‌కు ఓట‌మిని చ‌వి చూడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దాంతో ఆయ‌న‌పై ఎన్నిక‌ల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్ధులుగా పోటీచేసే వారిలో మ‌రింత న‌మ్మకం పెర‌గ‌డంతో కంప్యూట‌ర్ బాబాకు ప్రాముఖ్య‌త అమాంతం పెరుగుతూ వ‌స్తోంది.

అటువంటి ప్రాముఖ్య‌త‌గ‌ల కంప్యూట‌ర్ బాబా నేడు ఏపీ రాజ‌కీయాల‌కు సంబంధించి చెప్పిన స‌ర్వే లెక్క‌లు ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో తెగ వైర‌ల్‌గా మారాయి. ఇంత‌కీ ఆ కంప్యూట‌ర్ బాబా చేసిన స‌ర్వే ఏమిటి..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌ని చెప్పారు..? ఆయ‌న లెక్క ప్ర‌కారం ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి ఎవ‌రు..? అన్న వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఇక అస‌లు విష‌యానికొస్తే, ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంట్ స్థానాల‌కు ఏప్రిల్ 11న ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. అటువంటిది ఏ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో, ఏ పార్టీ అభ్య‌ర్ధి గెలుపొంద‌నున్నాడు..? అన్న విష‌యాల‌ను కంప్యూట‌ర్ బాబా చెప్పుకొచ్చారు.

ముగిసిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌ర‌ళిని దృష్టిలో పెట్టుకుని కంప్యూట‌ర్ బాబా ప‌లు పూజా కార్య‌క్ర‌మాలు ముగిసిన అనంత‌రం చెప్పిన లెక్క‌లు ఇలా ఉన్నాయి. టీడీపీ – 51, వైఎస్ఆర్ కాంగ్రెస్ – 91, జ‌న‌సేన – 1, మ‌రో 29 స్థానాల్లో నువ్వా..? నేనా..? అన్న మాదిరి జ‌న‌సేన‌, వైసీపీ, టీడీపీ పార్టీల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ ఉండ‌నుంద‌ని స‌మాచారం.

అలాగే, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల విష‌యానికొస్తే, టీడీపీ – 7, వైఎస్ఆర్ కాంగ్రెస్ – 16 గెలుపొంద‌నుండ‌గా, మ‌రో రెండు స్థానాల్లో ఇరుపార్టీల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని కంప్యూట‌ర్ బాబా లెక్క‌ల స‌మాచారం. ఇప్ప‌టికే అనేక స‌ర్వేలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న నేప‌థ్యంలో, అందులో ఇప్పుడు కంప్యూట‌ర్ బాబా స‌ర్వే వ‌చ్చి చేరింద‌ని, ఈ బాబా చెప్పిన లెక్క‌ల్లో ఉన్న నిజ‌మెంతో అన్న విష‌యం తేలాలంటే ఈ నెల 23 వ‌ర‌కు ఆగ‌క త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.